Sunday, April 5, 2020

కరోనా మార్పు ,!

 లాక్ డౌన్ లో కరోనా దెబ్బ వల్ల   జీవితంలో బ్రతికినoతా  కాలం ఊహించలేని, కొన్ని గొప్ప సంఘటనలు ఇవే  :

1.  సంపూర్ణ మద్యo నిషేధం .

2. దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ఆగడం.

3. పెద్ద నగరాల్లో  ట్రాఫిక్  లేక  పోవడం .

4. ట్రాఫిక్ జామ్లు లేని నగరాలు, కూడళ్ళు.

5.  కాలుష్య రహిత పట్టణాలు.

6.  ఇంట్లో  పిల్లల చదువు సంధ్య లు గుర్తించి , వాళ్లతో ఆడుకోవటం.

7. మగవాళ్ళు ఇంటి , వంట పనుల్లో సాయం చేయడం.

8.  షాపింగ్స్ , నగ వస్త్ర  పెద్ద ఎత్తున కాకుండా రోజువారీ  వస్తువులు  మాత్రమే కొనుక్కోవడం.

9. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడడం .

10.  బయట  అడ్డమైన దరిద్రాలు తినకపోవడం.

11. వ్యక్తిగత శుభ్రత ,  పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు వహించడం.

12.  బండిలో పెట్రోల్ పోసి  ఊరు,వాడలో షికారు తప్పడం .

13.సాధ్యమైనంతలో మాంసాహారాలు మాని కూరగాయలకే  అంకితం .

14. భారతీయ సాంప్రదాయ పద్దతిని  గుర్తుకు తీసుకురావడం .

15. సామాజిక బాధ్యత పాటించి   పక్కవారికి రోగాలు రాకూడదు అని కోరుకోవడం.

16. డబ్బు ఎంత ఉన్నా లేకున్నా ,  మన పనులు మనమే చేసుకోవాలి,పని మనుసులు వద్దు.ఆరోగ్యానికి  ముద్దు.

       ఆరోగ్యం,మనశ్శాంతి,ఐశ్వర్యం, క్రమశిక్షణ,  ఒళ్ళు వంచి పని చేయడం  మంచిది .                    🌹
సర్వేజనా సుఖినోభవంతు..కరోనా మార్పు ,!

No comments:

Post a Comment