Brahmi News

Sunday, August 7, 2022

బతుకమ్మ సంబరాలు

 పాలవరo గ్రామంలో అంకుమాంభ బజారులో ఏడాదిలో ఒక్కసారే అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ లో మన దేవీ నవరాత్రులు పండుగ. ప్రతీ సంవత్సరం మహా ఉత్సవ సంబరాలు తో వివిధ కార్యక్రమాలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా 9 నవర్రాతులు బతుకమ్మ పలు రకాల పూలు అలంకరించి వివిధ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి, పప్పు పలహరాలు తొ చిన్న పెద్దా అని తారతమ్యం లేకుండా అట పాటలో తో ఘనంగా నిర్వహించు కోవడం జరింగింది.9 రోజులూ కుడా పూజలు చేసి అమ్మవారి లడ్డూలు, చీరలు వేలం పాటలు వేసినా తర్వాత   శ్రీ నందుల సత్యనారాయణ శర్మ అధ్యారంలో పూజలు నిర్వహించి, అమ్మవారిని ఊరేగింపు ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడం జరింగింది.

Tuesday, September 28, 2021

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

 ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే పండుగ రానే వచ్చింది . మళ్ళీ ఈసారి కూడా ఇంకాాఎంతో  ఘనంగా జరుపుకోవాలనీ  నిర్వహించుకుంటున్నరు. పాలవరం  గ్రామంలో  దేవి నవరాత్రులు ఈసారి కూడ 9 రోజులు బతుకమ్మ , కుంకుమ పూజ  వంటి కార్యక్రమాలతో  పాటు అన్నదానం  కూడ   నిర్వహించాలి అని కమిటి నిర్వాహక సభ్యులు, యూత్ సభ్యులు , గ్రామపెద్దల సహకారాలతో అట్టి కార్యక్రమ పనులు ప్రారంభిస్తూ  ముందుకు కొనసాగాలి అనీ 9 దేవి నవరాత్రులు జరుపుకోవాలి.

Friday, September 17, 2021

మానవత్వం దిగజారిపోతోంది...

 ఆ చిట్టి తల్లి మోసపోయింది...

మాతృత్వం తో వికసించిన ఆ పసిమొగ్గ

పుష్పించకుండానే రాలిపోయింది...

క్రూర మృగాలు సంచరిస్తున్న ఈ సమాజారణ్యంలో 

బలిపశువై  వేటడబడింది....

ఆడదిగా ఇక్కడ పుట్టడం తనకు శాపమని తెలియని ఈ వయసులో ఏమి జరుగుతుందో తెలియకుండానే శాశ్వత నిద్రకు ఉపక్రమించింది.

చనిపోయాక కూడా తనకు న్యాయం జరగని కులంలో పుట్టి ఇంకాస్త మోసపోయింది...

అవును మోసపోయింది...

జోహార్ చిట్టితల్లి జోహార్... జోహార్....

చిట్టి తల్లికి ఇవే మా కన్నీటి వీడ్కోలు....

బెల్లంకొండ ఉపేందర్ గౌడ్

ప్రైవేట్ స్కూల్ తెలుగు టీచర్ (కోదాడ)...

Sunday, October 11, 2020

పట్టభద్రులార మేల్కొండి ఇకనైనా


 మండల పరిధిలోని పాలవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ అధ్యర్యంలో ఎమ్మ్మెల్సీ  ఓటర్ల నమోదు కార్యక్రమం శనివారం నిర్వహించారు ,ఈ సందర్భంగా ముఖ్య అతిధిగాపాల్గొన్న  వంగవీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో 2017 వరకు పట్టభద్రులా  అర్హులైన వారందరిని  ఓటర్లుగా నమోదు  చేయాలనీ  ఓటర్లు నమోదు పక్రియ లో పలు జాగ్రతలు తీశుకోవాలని సూచించారు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి నమోదు పక్రియను వేగవంతం చేసి అధిక మొత్తంలో ఓట్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ,ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జి సాతులూరి హనుమంతరావు మీడియా ఇంచార్జి బొర్రా నవీన్ ,మట్టపల్లి సిద్దయ్య ,బెల్లంకొండ  ఉపేందర్ ,మట్టపల్లి బ్రహ్మం గౌడ్ ,బెల్లంకొండ కాశయ్య ,కొండ మధు ,రెడ్డిమళ్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నారు .

Thursday, September 10, 2020

సంచలాత్మక మైన నిర్ణయం

 రాష్ట్ర వ్యాప్తంగా వి ఆర్ ఓ  రద్దు  విధానాన్ని అమలు పర్చడం సంచనాత్మక  నిర్ణయం,అని తే రాస  మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి పుల్లయ్య గౌడ్ అన్నారు ,మండల  కేంద్రంలో     విఆర్ఓ  విధానం రద్దు చేయడం పట్ల బుధవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు  ,ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు  శ్రేయస్సు కొరకు సంచలనాత్మక  నిర్ణయం  తీశుకొన్నారని  రెవిన్యూ విధానంలో అవినీతి అక్రమాలకు  తావు లేకుండా  కొత్త విధానాన్ని చేపట్టడం  చెప్పుకోదగ్గ విషయం అని  భూముల రిజిస్టేషన్ ప్రక్రియల  వారం  పది రోజులలో పూర్తి చేసే ఈ  విదంగా  చర్యలు చేపట్టాలని రైతు శ్రేయస్సు  కొరకు పని చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని  రైతులశ్రేయస్సు ప్రభుత్వ దెయ్యమని అయన  కొనియాడారు .ఇట్టి కార్యక్రమంలో  ఎంపీపీ ,జడ్పీటీసీ ,సర్పంచ్ లు ,ప్రజా ప్రతినిధులు ,నాయకులు ,పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు .


Friday, August 14, 2020

ఘనంగా జన్మదిన వేడుకలు ..

 కోదాడ ఎమ్మ్మెల్యే  బొల్లం మల్లయ్య యాదవ్ గారు జన్మదిన వేడుకలను మండల టీఆర్ ఎస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు 

నేడే స్వాతంత్ర దినోత్సవం

 విద్యార్థులను రిస్క్ లో పడెయ్యొద్దు! 

     

   రేపు 15th ఆగష్టు. స్వాతంత్ర్య దినోత్సవం. ఈ వేడుకల్ని పాఠశాలల్లో ఏటా ఘనంగా జరుపుకుంటాం! కానీ, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయ్. భౌతిక దూరం తప్పనిసరి. అందరు మాస్కులు ధరించాలి. కోవిడ్-19 నిబంధనలు విధిగా పాటించాలి. కాబట్టి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరై, ఈ వేడుకలు నిర్వహించుకుంటే సరిపోతుంది. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, SMC వంటి వారిని పరిమిత సంఖ్యలో పాఠశాలకు ఆహ్వానించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మంచిది. విద్యార్థులను పాఠశాలకు రావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తోంది. పైగా, గత ఐదు నెలలుగా పాఠశాలలు క్లోజ్! పాఠశాల ఆవరణ ఏమాత్రం బాగుండదు. తరగతి గదులు సైతం దుమ్ముధూళి పట్టి విద్యార్థులు కూర్చోవడానికి వీల్లేకుండా ఉంటయ్! కాబట్టి, విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. రిస్క్ తీసుకోవద్దు. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటయని ఎవరూ మర్చిపోవద్దు! అదీ కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులు పాల్గొనాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఒడిశా వంటి రాష్ట్రాలు విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవానికి పాఠశాలలకు పిలువకూడదని లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చాయి కూడా! అందుకని, హెచ్ఎంలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజే విద్యార్థులకు మెసేజ్ పెట్టి, ఫోన్ చేసి రేపు పాఠశాలకు ఎవరూ రావొద్దని ఖచ్చితంగా చెప్పాలి. ఏటా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులే వెళ్లి గ్రామంలో పలుచోట్ల జరిగే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీ. అయితే, ఈ సారి ప్రభాతభేరీ ఉండదు. స్కూల్లో మినహా గ్రామంలోని మిగతా జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం కూడా కుదరదు. ఈ విషయాన్ని ఈ రోజే జెండా వందన నిర్వాహకులకు తెలియజేయడం మంచిది. పాఠశాలలకు వచ్చే గెస్టులకు, ఉపాధ్యాయులకు ఈసారి ఎలాంటి స్వీట్స్, ఫ్రూప్ట్స్ ఇవ్వకూడదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ మొత్తం ప్రోగ్రాంని ఓ 20 నిమిషాల్లో ముగించుకోవడం బెటర్! 

👍  ఇట్లు ,          మీ  వివేకానంద యూత్                                       పాలవరం                🇨🇮🇨🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳