Friday, August 14, 2020

నేడే స్వాతంత్ర దినోత్సవం

 విద్యార్థులను రిస్క్ లో పడెయ్యొద్దు! 

     

   రేపు 15th ఆగష్టు. స్వాతంత్ర్య దినోత్సవం. ఈ వేడుకల్ని పాఠశాలల్లో ఏటా ఘనంగా జరుపుకుంటాం! కానీ, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయ్. భౌతిక దూరం తప్పనిసరి. అందరు మాస్కులు ధరించాలి. కోవిడ్-19 నిబంధనలు విధిగా పాటించాలి. కాబట్టి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరై, ఈ వేడుకలు నిర్వహించుకుంటే సరిపోతుంది. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, SMC వంటి వారిని పరిమిత సంఖ్యలో పాఠశాలకు ఆహ్వానించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మంచిది. విద్యార్థులను పాఠశాలకు రావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తోంది. పైగా, గత ఐదు నెలలుగా పాఠశాలలు క్లోజ్! పాఠశాల ఆవరణ ఏమాత్రం బాగుండదు. తరగతి గదులు సైతం దుమ్ముధూళి పట్టి విద్యార్థులు కూర్చోవడానికి వీల్లేకుండా ఉంటయ్! కాబట్టి, విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. రిస్క్ తీసుకోవద్దు. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటయని ఎవరూ మర్చిపోవద్దు! అదీ కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులు పాల్గొనాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఒడిశా వంటి రాష్ట్రాలు విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవానికి పాఠశాలలకు పిలువకూడదని లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చాయి కూడా! అందుకని, హెచ్ఎంలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజే విద్యార్థులకు మెసేజ్ పెట్టి, ఫోన్ చేసి రేపు పాఠశాలకు ఎవరూ రావొద్దని ఖచ్చితంగా చెప్పాలి. ఏటా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులే వెళ్లి గ్రామంలో పలుచోట్ల జరిగే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీ. అయితే, ఈ సారి ప్రభాతభేరీ ఉండదు. స్కూల్లో మినహా గ్రామంలోని మిగతా జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం కూడా కుదరదు. ఈ విషయాన్ని ఈ రోజే జెండా వందన నిర్వాహకులకు తెలియజేయడం మంచిది. పాఠశాలలకు వచ్చే గెస్టులకు, ఉపాధ్యాయులకు ఈసారి ఎలాంటి స్వీట్స్, ఫ్రూప్ట్స్ ఇవ్వకూడదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ మొత్తం ప్రోగ్రాంని ఓ 20 నిమిషాల్లో ముగించుకోవడం బెటర్! 

👍  ఇట్లు ,          మీ  వివేకానంద యూత్                                       పాలవరం                🇨🇮🇨🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳

No comments:

Post a Comment