Sunday, April 5, 2020

"జాగ్రత్త' సుమా" !

ప్రధానమంత్రి పిలుపుతో రాత్రి 9 గంటలకు దీపయజ్ఞానికి సిద్ధమవుతున్న దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరీ ఈ సూచన చేసింది. అదేంటంటే కరోనా నివారణ చర్యల్లో భాగంగా అందరూ శానిటైజర్స్‌ను వాడుతున్నారన్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రధానమంత్రి పిలుపుతో దీపాలు వెలిగించే ముందు  ఆల్కహాలిక్ శాలిటైజర్స్‌తో ఎప్పటి పరిస్థితుల్లో చేతులను శుభ్రం చేసుకోవద్దని కేంద్రం సూచించింది. ఎందుకంటే ఆల్కహాలిక్ శానిటైజర్స్‌కు మండే గుణం ఉంది . దీపాలు వెలిగించే ముందు ఆల్కహాలిక్ శానిటైజర్స్ వాడితే పొరపాటున మంటలు వ్యాపించే ప్రమాదముందని కేంద్రం తన సూచనలో పేర్కొంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకొన్న  తర్వాతే దీపయజ్ఞంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు దీపాన్ని వెలిగించే ముందు ఈ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లో మర్చిపోకండి కరోనా అంధకారాన్ని తరిమికొట్టేందుకు దీపకాంతులను వెలిగిద్దాం. రాత్రి 9 గంటల నుండి  9 నిముషాలు పాటు పాల్గొని మన మోడీ గారు పిలుపును  విజయవంతం చేయగలరని మనవి ."జాగ్రత్త' సుమా" !

No comments:

Post a Comment