Monday, April 6, 2020

"శభాష్' అని పించుకోన్న చిన్నోడు' !

పార్ధించే  పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న ఆ మాటల్ని నిజమని నిరూపించాడు ,ఓ చిన్నోడు (బుడతడు)కరోనాతో  కష్టాలో ఉన్న వారికోసం కోసం చిన్నవాడైన  తన పెద్ద మనసు చాటుకొన్నాడు ,ప్రజాప్రతినిదులు ,సినిమా సెలబ్రిటీలు,  వ్యాపారవేత్తలు ,సంస్థలకు తోడుగా తాను కూడ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా సాయం చేసి శబాష్ అనిపించుకొన్నాడు.ఓ  నాల్గుగేడ్ల  బుడతడు తాను దాచుకొన్న  (971 రూపాయలు)కరోనాపై జర్గుతున్న పోరాటానికి అందజేసి  పెద్దమనసు  చాటుకొన్నాడు, విజయవాడకు చెందిన నాలుగేళ్ల హేమంత్‌ సైకిల్‌ కొనుక్కోవడానికి కొంత డబ్బు దాచుకున్నాడు. అయితే ఆ డబ్బులను కరోనాపై పోరాటం చేస్తున్న సీఎం జగన్‌, ఏపీ ప్రభుత్వానికి ఇస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వాళ్లు హేమంత్‌ను మంత్రి పేర్ని నాని దగ్గరకు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ డబ్బును మంత్రికి అందజేశారు.
తాను ఇచ్చిన డబ్బును సీఎం సహాయ నిధికి పంపించాలని బాలుడు హేమంత్ కోరాడు. సీఎం వైఎస్‌ జగన్‌ అంటే ఇష్టమని.. అందుకే తాను దాచుకున్న డబ్బులు  కూడ సహాయ నిధికి ఇస్తున్నానని హేమంత్‌ అంటున్నాడు. బాలుడ్ని మంత్రి అభినందించారు. అలాగే హేమంత్‌‌కు మరో బంపరాఫర్ ఇచ్చాడు.. ఆ బుడతడు కొనుక్కోవాలనుకున్న సైకిల్‌ను తాను కొనిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment